టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మధ్యాహ్నం సమయంలో గచ్చిబౌళిలోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి వైద్యులు ఆయనను డిశ్చార్చి చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు. ఏఐజీ ఆసుపత్రి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అక్కడే క్యాటరాక్ట్ సమస్యకు డాక్టర్లు చంద్రబాబుకు శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
వైద్య పరీక్షల కోసం గురువారం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు చంద్రబాబు. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కె.రాజేష్ ఆధ్వర్యంలో జనలర్ మెడిసిన్ తో పాటు కార్డియాలజీ, ఫల్మనాాలజీ, డెర్మటాలజీ, విభాగాలకు చెందిన వైద్యులు ఆయన రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. రక్త, మూత్ర, పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ వంటి ఇతర టెస్టులు చేసినట్టు తెలుస్తోంది. జైలులో చంద్రబాబుకు తీవ్ర అలర్జీ, అనారోగ్యాల కారణంతో మధ్యంతర బెయిల్ లభించింది.