తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. టెన్త్ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది తెలంగాణ విద్యాశాఖ. 9, 10వ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను 12 నుంచి ఆరుకు తగ్గించింది.
దీనిలో నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో దానికి 6 మార్కులు. స్వల్ప ప్రశ్నల విభాగంలో 6 ప్రశ్నలు ఉంటాయి. అన్నిటికి సమాధానం రాయాలి. ఒక్కో దానికి 4 మార్కులు. అది స్వల్ప ప్రశ్నలు 6 ఉంటాయి. ఒక్కదానికి 2 మార్కులు. 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 20 మార్కులు కేటాయించారు.