పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదు – బండి సంజయ్

-

తెలంగాణ రైతులను పట్టించుకోని సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు మాత్రం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని.. చివరికి ఆ చెక్కులు చెల్లకపోవడంతో తెలంగాణ పరువు పోయిందని ఎద్దేవా చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దీంతో కెసిఆర్ ని చూసి దేశం అంతా నవ్వుకుంటుందని అన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లోని నందన్ తండాలో జరిగిన రచ్చబండ లో బండి సంజయ్ మాట్లాడుతూ..

లిక్కర్ దందాలో ఎమ్మెల్సీ కవిత వేలకోట్ల పెట్టుబడి పెట్టిందని ఆరోపించారు. ఇక్కడున్నవి బెల్ట్ షాపులు కావని, కెసిఆర్ షాపులని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేసేందుకే ధరణి తీసుకువచ్చారని విమర్శించారు. టిఆర్ఎస్ నేతలు కేవలం ఎన్నికల సమయంలోనే కనబడతారని.. ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోతారని విమర్శించారు. పేదవాళ్ల సమస్యలు తెలుసుకోమని ప్రధాని మోదీ ఆదేశిస్తే.. పాదయాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news