షాద్‌నగర్ దళిత మహిళ ఎపిసోడ్ పై ప్రభుత్వం రియాక్ట్ అయింది. సీఐతో పాటు ఆరుగురు సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఫోన్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. అయితే షాద్ నగర్ పట్టణ పోలీసులు ఒక చోరీ కేసులో దళిత మహిళ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి శిక్షించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసు పూర్వపరాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, దళిత కుటుంబానికి అండగా ఉండాలని… సంబంధిత పోలీసు సిబ్బంది, అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నత అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఒక సీఐ సహా ఆరుగురు సిబ్బందిని వెను వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో షా ద్ నగర్ వంటి సంఘటనలను సహించేది లేదని డిప్యూటీ సీఎం పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు.