బిల్డర్ అసోసియేషన్, క్రీడాయి, నేరేడ్కో ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ… టౌన్ ప్లానింగ్ సమస్యలను ఇప్పటికే చాలా చోట్ల క్లియర్ చేశాం. బిల్డర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇతర ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ ను పరిశీలిస్తాం. పది టీమ్స్ వెళ్లి ఇతర రాష్ట్రాల్లో పరిశీలిస్తారు. టౌన్ ప్లానింగ్ లో రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని పేర్కొన్నారు.
అయితే ఈ రూల్స్ సులభతరం చేస్తాం. అనధరైజేస్ లే అవుట్ కు ఇకపై రిజిస్ట్రేషన్ జరగవు. ఆన్లైన్ లో పబ్లిక్ కు లే అవుట్స్ గురించి తెలిసేలా ఒక సిస్టం తీసుకుని వస్తం. రేపు ఉదయం 7 గంటలకు అమరావతి లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభం అవుతుంది. నెల రోజుల్లో ఈ పని పూర్తవుతుంది. R5 జోన్ లో ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. అలాగే అమరావతి రైతు కూలీలకు టిడ్కో ఇల్లు ఇస్తాం అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.