సచివాలయం వద్ద ‘సీఎం డౌన్ డౌన్’ నినాదాలు..!

-

తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రూపు-1 పరీక్షను వాయిదా వేయాలని.. జీవో నెం.29ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం యధావిధిగా గ్రూపు-1 పరీక్షలు కొనసాగుతాయని ప్రకటించేసింది. మరో వైపు హై కోర్టు కూడా గ్రూపు-1 అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. దీంతో కొంత మంది అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం మొదటి కేసుగా విచారణ చేయనున్నట్టు ప్రకటించింది.

సోమవారం నుంచి పరీక్షలు ఉండటంతో వాయిదా వేయాలని గ్రూపు-1 అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. అశోక్ నగర్ నుంచి తెలంగాణ సచివాలయం వరకు గ్రూపు-1 అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి సెక్రటేరియట్ ఎదురుగా బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆందోళన కారులను పోలీసులు వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి ఒక్కొక్కరినీ తరలిస్తున్నారు. కొంత మంది యువతులు మీడియాతో మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. మీడియా మాట్లాడిన వారిని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా కేసుల్లో ఇరుక్కోవద్దంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గ్రూపు-1 అభ్యర్థుల ఆందోళనతో సచివాలయం ప్రాంగణం వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news