కేసీఆర్ బాటలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి..!

-

కేసీఆర్ బాటలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి పయనం కానున్నారు. మరో సంచలనానికి తెరలేపనుంది టీవీ9 ఛానెల్‌. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ 4 గంటల మారథాన్ ఇంటర్వ్యూ తో చరిత్ర సృష్టించింది టీవీ9. ఇక ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో మరో బ్లాస్టింగ్ ఇంటర్వ్యూకు సిద్ధం అయింది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మరో బిగ్ లైవ్‌కు రెడీ అయింది. కేసీఆర్‌ తరహాలోనే రజినీకాంత్‌ కు ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు సీఎం జగన్. కాగా, నెల్లూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన ఖరారు అయింది. నేడు వెంకటగిరిలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట 15 నిముషాలకు. విశ్వోదయ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news