దేశంలోనే ‘గ్రీన్ యాపిల్’ అవార్డులు దక్కించుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ : కేసీఆర్

-

తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. లండన్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్రంలోని అయిదు నిర్మాణాలను ‘గ్రీన్‌ యాపిల్‌’ పురస్కారాలకు ఎంపిక చేసింది. అద్భుతమైన ధార్మిక విభాగాల కేటగిరీలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని, అందమైన కార్యాలయ భవన విభాగంలో రాష్ట్ర సచివాలయం, ప్రత్యేక కార్యాలయ అంశంలో ఇంటిగ్రేటెడ్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, అద్భుత పునరుద్ధరణకు గాను వారసత్వ విభాగంలో మొజంజాహి మార్కెట్‌, అందమైన ఆకృతి గల దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని వంతెనల విభాగంలో ఎంపిక చేసింది.

తెలంగాణకు ఈ పురస్కారాలు లభించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మొదటిసారిగా ఈ పురస్కారాలను దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ద్వారా.. రాష్ట్రంతో పాటు దేశ ఖ్యాతి కూడా ఇనుమడించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని.. అత్యున్నత, ప్రపంచస్థాయి ప్రమాణాలతో పర్యావరణ నియమాలకు అనుగుణంగా నూతన కట్టడాల నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతోందని వివరించారు. అందుకు ఈ పురస్కారాలే నిదర్శనమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news