నేడు మహబూబాబాద్‌ లో సీఎం కేసీఆర్.. వ్యాప్తంగా కొనసాగుతున్న అరెస్టుల పర్వం

-

నేడు మహబూబాబాద్ పర్యటనకు వెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో నిరసన గళం వినిపించేందుకు పలు ఆదివాసి నాయకులు,ప్రతిపక్ష పార్టీలు, వీఆర్ఏలు,విద్యార్థి సంఘాలు,సిద్ధం కావడంతో గూడూరు,గార్ల,చిన్న గూడూరు,కొత్తగూడ, నెల్లికుదురు, కేసముద్రం, కొరివి,మరికొన్ని మండలాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికి అక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పన ప్రకటన,పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం తోపాటు పలు హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఇప్పటికే జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీఎం పర్యటన ను అడ్డుకుంటారని నెపంతో ఎక్కడికి అక్కడ ఎవ్వరు దొరికితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీస్ ఉన్నాతాధికారులు. ఇప్పటికే జిల్లాలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి గస్తీ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news