గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభించిన సీఎం కేసీఆర్

-

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనంను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్ట్యా 12 నిర్మాణాలను చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, పండితులతో చండీయాగం నిర్వహించారు. చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చేతుల మీదుగా సదనం ప్రారంభోత్సవం జరిగింది.

మూడంతస్తుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం ఉన్నాయి. భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్‌ సెంటర్‌గా ఈ భవనం సేవలందించనుంది.  బ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధి కోసం 18 మంది సభ్యులతో కూడిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రిటైర్డ్‌ IAS కేవీ రమణాచారి సారథ్యం వహిస్తున్నారు. పరిషత్తు ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రారంభోత్సవం అనంతరం అఖిలభారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ ప్రదీప్, పీఠాధిపతులను కేసీఆర్ సత్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news