’45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే’.. WFIకి అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ వార్నింగ్

-

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు గత కొంతకాలంగా ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. రెజ్లర్ల ఆందోళనపై తాజాగా అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ స్పందించింది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. అటుగా మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.

‘రెజర్లతో వ్యవహరించిన తీరు, వారి నిర్బంధాన్ని ఖండిస్తున్నాం. అలాగే లైంగిక వేధింపుల ఆరోపణలపై చేస్తోన్న దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. రెజ్లర్లు చేస్తోన్న ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాం. 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేయాల్సి ఉంటుంది. గత కొద్దినెలలుగా రెజ్లర్ల చేస్తోన్న ఆందోళనను మేం గమనిస్తున్నాం. ఈ నిరసనల ప్రారంభ రోజుల్లోనే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని ఆయన బాధ్యతల నుంచి పక్కన పెట్టిన విషయం మా దృష్టిలో ఉంది. రెజ్లర్ల భద్రత, నిష్పాక్షిత దర్యాప్తు నిర్ధారించేందుకు మరోసారి సమావేశం నిర్వహించనున్నాం’అని యూడబ్ల్యూడబ్ల్యూ తన ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news