నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగార్థులు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నోటిఫికేషన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్లో నిర్వహించగా.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..
నోటిఫికేషన్ మరియు నోటిఫికేషన్ కు మధ్య కొంత వ్యవధి ఇవ్వాలని చెప్పినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే పలు ప్రభుత్వ విభాగాలు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యా రని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ అందిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.
ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి.. నేటి స్థితిగతులకు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యమన్న కేసీఆర్.. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగులలో, విద్యుత్ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం, ప్రజసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలువడం మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు.