ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించింది: కేసీఆర్

-

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజంతో పాటు, దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అంతే కాకుండా గత తొమ్మిదేళ్లలో తెలంగాణ.. వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్ధిపై మాట్లాడారు. ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగ అభివృద్ధి దిశగా… ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రం… ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రం వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శమని కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్, వరంగల్ వంటి ముఖ్య పట్టణాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నిమ్స్‌ను 2,500 పడకలతో విస్తరిస్తున్నట్లు ఆయన వివరించారు. కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూచికల్లో… జాతీయ స్థాయి కంటే తెలంగాణ మెరుగ్గా ఉండడం… స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతగా కేసీఆర్‌ అభివర్ణించారు. మరోవైపు బస్తీ దవాఖానాలతో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news