ఉదయం లేచిన వెంటనే ఇలా చేస్తే… రోజంతా కూడా ఆరోగ్యంగా ఉండచ్చు..!

-

ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే నిజానికి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు తగిన పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉండాలి. చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలని డైట్ లో తీసుకుంటూ ఉండాలి.

అలానే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి నిద్ర కూడా చాలా ముఖ్యం. అయితే ఉదయం లేచిన తర్వాత వీటిని అనుసరిస్తే ఖచ్చితంగా రోజంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉదయం పూట చాలామంది చేసే తప్పులు కారణంగా రోజులు రకరకాల బాధలు ఉప్పడాల్సి వస్తుంది. మరి ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే మెడిటేషన్ ముఖ్యం:

ఉదయాన్నే మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. కనీసం లేచిన తర్వాత పది నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి దాంతో ఒత్తిడి దూరం అవుతుంది. ఉదయం లేచిన తర్వాత చాలా మంది మెయిల్స్ చూసుకోవడం సోషల్ మీడియా లో మునిగిపోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులను చేయకుండా ఉదయం లేచాక కాస్త ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోండి. మెడిటేషన్ చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు.

హైడ్రేట్ గా ఉండండి:

ఉదయం లేచిన తర్వాత మంచి నీళ్లు తీసుకోవడం మంచిది. కాఫీ టీ ని తీసుకునే ముందు అయినా ఎనిమిది ఔన్సుల నీళ్లు తీసుకోండి దాంతో ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. రోజంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. మోడరేట్ గా కాఫీ ని తీసుకుంటే డయాబెటిస్ రిస్క్ ఉండదు. స్ట్రోక్ గుండె సమస్యలు కూడా ఉండవు.

ప్రోటీన్ ఉండే బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోండి:

ప్రోటీన్ ఉండే బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ ఉండే బ్రేక్ ఫాస్ట్ ని కాదు. పండ్లు వంటివి కూడా మీరు బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవచ్చు.

కదులుతూ ఉండండి:

కదులుతూ ఉంటే బ్రెయిన్ లోకి ఆక్సిజన్ వెళుతుంది ఫోకస్ గా ఉండొచ్చు ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి రోజు కాసేపు వాకింగ్ చేయండి ఉదయం పూట వాకింగ్ చేయడం కూడా మంచిది.

మంచిగా ప్లాన్:

లేచాక చక్కగా మంచి రిలాక్స్ స్నానం చేయండి. స్క్రీన్ ని దూరంగా ఉంచండి కావలసిన వాటిని అన్నిటిని ప్రిపేర్ గా ఉంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని రోజంతా కూడా ఆరోగ్యంగా ఉండండి.

 

Read more RELATED
Recommended to you

Latest news