దూసుకొస్తున్న ఎన్నికల ముప్పు ? కేసీఆర్ ప్లాన్ ఇదే ?

-

ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, నిజామాబాద్ ఉప ఎన్ని,క, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే దుబ్బాకలో శాసనసభ ఉప ఎన్నికలు, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు ఇలా, అన్ని వరుసగా వస్తుండడంతో, అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఎక్కడలేని కంగారు మొదలైంది. కేవలం గెలుపొక్కటే కాకుండా, విపక్షాలు ఊహించని స్థాయిలో ఫలితాలను సాధించాలనే పట్టుదలతో అధికారపార్టీ అడుగులు వేస్తోంది. ఏ స్థానంలోనూ ఓటమి చెందకుండా టిఆర్ఎస్ విజయానికి ఏం చేయాలనే విషయంపై కెసిఆర్ పూర్తిగా దృష్టి సారించారు. విపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, ఎక్కడికక్కడ పైచేయి సాధించేందుకు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కు అప్పగించారు.


అలాగే దుబ్బాక లో జరగబోయే శాసనసభ ఉప ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను తన మేనల్లుడు మంత్రి హరీష్ రావు కు అప్పజెప్పారు. అలాగే నిజామాబాద్ లో తన కుమార్తె కవిత ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల నుంచి పోటీ చేస్తూ ఉండడంతో ఆమెకు ఎదురే లేకుండా కేసీఆర్  కొంతమంది మంత్రులకు ఆ బాధ్యతలను అప్పగించారు. అలాగే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూడా తమ మద్దతుదారులు గెలుపొందే విధంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా వరుసగా దూసుకొచ్చిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం నిరూపించుకుని, విపక్షాలపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

వచ్చే నెల 9వ తేదీన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ, జడ్పిటిసి కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉన్నారు. మూడు వంతులకు పైగా టిఆర్ఎస్ కు చెందినవారే ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడ గెలుపు ధీమా ఉన్నా సరే, ఇక్కడ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  కవితకు గెలుపు దక్కకుండా రాజకీయం చేసే అనుమానం టీఆర్ఎస్ లో ఉంది.ఆయన ఫలితాలను తారుమారు చేస్తారనే భయంతో జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ తో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ నాయకులకు నియోజకవర్గాలు, మండలాలు, కార్పొరేషన్ వారిగా బాధ్యతలు అప్పగించి ఓట్లు చెల్లాచెదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్న  సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణం తో అక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. ఇక త్వరలోనే రాబోతోంది బీహార్ ఎన్నికలతో పాటు అంటే నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో గెలుపు టిఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం కావడంతో, భారీ మెజారిటీతో  టిఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలనే విధంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత రెడ్డి కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు పార్టీ తరఫున అందిస్తున్నారు.

అలాగే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విపక్షాలకు చెందిన వారు ఎవరు పై చేయి సాధించకుండా చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న150 డివిజన్లలో జరగబోతున్న ఎన్నికలను కెసిఆర్ కుమారుడు కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో అంటే 2016 ఇక్కడ 99 స్థానాలు టిఆర్ఎస్ ఖాతాలోకి పడేవిధంగా కేటీఆర్ చక్రం తిప్పారు. ఇప్పుడు అంతే స్థాయిలో ఫలితాలు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే విధంగా ఆయన చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ, సీట్లు సంపాదించి తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని కేటీఆర్ చూస్తున్నారు. ఇలా వరుసగా రాబోతున్న ఎన్నికల్లో  పైచేయి సాధించేందుకు టిఆర్ఎస్ నాయకులు అందరికీ కెసిఆర్ బాధ్యతలు అప్పగించి సీరియస్ గానే ఫలితాలు సాధించే విషయంపై దృష్టి పెట్టే విధంగా కేసీఆర్ నిరంతరం ఈ ఎన్నికలపై దృష్టిసారించి పార్టీ నాయకులను అప్రమత్తం చేస్తున్నాడు.

 

-Surya

Read more RELATED
Recommended to you

Latest news