తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సిఎం కేసీఆర్ తీపికబురు

-

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేపట్టి ఆ తర్వాత పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

పదోన్నతి పై ఆమె గురువారం తన కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అలాగే కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు. నూతన జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారిగా హెచ్ ఎoల మండల స్థాయి వరకు బదిలీలు పదోన్నతులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏంఈఓ అలాగే డిప్యూటీ ఈవో పదోన్నతులు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి చెప్పినట్లు సమాచారం అందుతోంది. సీఎం కేసీఆర్ హామీ మేరకు 5571 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి… ఎస్ జి టి లకు పదోన్నతులు కల్పించి… భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news