సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా

-

భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీ మంగళవారం రోజున కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలి. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన టూర్ వాయిదా పడింది. అయితే ఈ టూర్ ఎందుకు వాయిదా పడిందో స్పష్టంగా తెలియ రాలేదు. మే 4వ తేదీన ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు ముందే వెల్లడించాయి. కానీ ఈ పర్యటన వాయిదా పడింది. ఈ పర్యటనను గులాబీ బాస్ రేపటికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక గత మూడు రోజులుగా సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీన కొత్త సచివాలయం ప్రారంభం, మే 1వ తేదీన సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. మే 1వ తేదీనే తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున మహారాష్ట్ర నాయకులు పార్టీలో చేరగా వారిని సాధారణంగా ఆహ్వానించారు. ఇక ఈరోజు కూడా సచివాలయంలో అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news