మేం సిసి రోడ్లు వేశాం.. నువ్వేం చేశావు పులకేశి..? నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాము అధికారంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు వేశాం… నువ్వేం చేశావు పులకేశి?! అని ప్రశ్నించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం పుట్టపాశం దళితవాడలో తాము అధికారంలో ఉండగా నిర్మించిన సిసి రోడ్డు తాలూకు శిలాఫలకం అని.. నేను పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసిన రెండున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేశానన్నారు.

నాలుగేళ్ల జగన్ రెడ్డి గారి జమానాలో కొత్తరోడ్ల నిర్మాణం మాట దేవుడెరుగు.. గోతుల్లో తట్ట మట్టిపోసే దిక్కులేదని ఎద్దేవా చేశారు. వర్షం వస్తే రోడ్లు తటాకాలను తలపిస్తున్నాయన్నారు. రోడ్లువేయడానికి టెండర్లు పిలచినా జగన్ మొఖం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారని.. దిక్కుమాలిన పాలనతో జనానికి చుక్కలు చూపిస్తూ రాజుగారి ఒంటిమీద దేవతా వస్త్రాల మాదిరిగా అంతా బాగుందని డబ్బాలు కొట్టించుకోవడం పులకేశి పాలనలో మాత్రమే సాధ్యం! తీవ్ర విమర్శలు చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news