కేసీఆర్ చేసిన శివ‌య్య ప్రార్థ‌న ఏంటంటే..?

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్ధ‌తకూ, అచంచల విశ్వాసానికీ,త్యాగానికీ ప్రతీకగా ఉపవాస దీక్షలతో, జాగర‌ణ‌లతో శివరాత్రి పండుగను హిందువులు అత్యంత భ‌క్తి,శ్ర‌ద్ధ‌ల‌తో జరుపుకుంటారని అన్నారు.

 

సృష్టి లయకారునిగా శివుడ్ని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని సీఎం ప్రార్థించారు.