తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా ఈరోజు ( సోమవారం) యాదాద్రి పర్యటనకు వెళ్లారు. ఇటీవల యాదాద్రి దేవాలయ పున: ప్రారంభం తరువాత తొలిసారి మళ్లీ యాదాద్రికి వెళ్లారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ కు పుర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు యాదాద్రిలో ప్రధాన ఆలంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. రామలింగేశ్వర ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అర్చకులు. సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు ఎంపీలు సంతోష్ కుమార్. ఎమ్మెల్యేలు ఉన్నారు.
యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహణలో ఆచారపర్వాలు అయిదు రోజులుగా కొనసాగుతున్నాయి. ఈరోజు జరగనున్న మహాక్రతువు ఉత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు.