నిజాం రాజులు స్థాపించిన అజాంజాహీ మిల్లును కాంగ్రెస్‌ పార్టీ అమ్మేసింది : సీఎం కేసీఆర్‌

-

కాంగ్రెస్‌ హయాంలో వరంగల్‌ పట్టణానికి చాలా అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పట్టణ ప్రజలకు తాగునీటికి కూడా కటకట ఉండేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినంక మిషన్‌ భగరీరథ కార్యక్రమంతో ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి తాగే నీటి సరఫరా చేస్తున్నామని, వరంగల్‌ ప్రజలకు ఇప్పుడు తాగే నీటి గోస లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

కాంగ్రెస్‌ అసమర్థ పాలనవల్ల వరంగల్‌ పట్టణంలో తాగు నీళ్లకు కరువు ఏర్పడింది. తెలంగాణ రాకముందు తాగు నీళ్లకు గోస ఉండె. ఇప్పుడు మిషన్‌ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నయ్‌. నిజాం కాలంలో పెట్టిన అజాంజాహీ మిల్లును కాంగ్రెస్‌ పార్టీ అమ్మేసింది. బీఆర్‌ఎస్‌ వచ్చినంక వరంగల్‌ దగ్గరలోనే బ్రహ్మాండమైన టెక్స్‌టైల్‌ పార్కును పెట్టుకున్నం. చాలా పెద్దపెద్ద కంపెనీలు వచ్చినయ్‌. ఏడాది, రెండేండ్లలో ఆ టెక్స్‌టైల్‌ పార్కులో లక్షల మంది ఆడవాళ్లు, మగవాళ్లకు ఉద్యోగాలు రాబోతున్నయ్‌ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news