దళితబంధు అప్పుడే ఇచ్చి ఉంటే.. ఇప్పుడు పేదరికం ఎందుకు ఉండేది : సీఎం కేసీఆర్

-

ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఇవాళ తొలి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో హుస్నాబాద్ అభ్యర్థి సతీష్ కి బీ ఫామ్ అందజేశారు కేసీఆర్. బహిరంగ సభలో  కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.   కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నారు.. కానీ 10 ఛాన్స్‌లు ఇచ్చిండ్రు కదా.. 60 ఏండ్లు మీరే రాజ్యం ఎలగబెట్టిండ్రు కదా! దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. దళితులు పేదరికంలో మగ్గుతున్నరంటే.. 75 సంవత్సరాల స్వతంత్య్రం తర్వాత ఇంకా పేదరికం కమ్ముకుని ఉన్నదంటే దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలి. మనందరం కూడా బాధపడాలి.

60, 70 ఏండ్ల కింద దళితబంధులాంటి పథకం ప్రారంభించి ఉంటే.. ఇవాళ దళితుల్లో ఎందుకు పేదరికం ఉండేదనేది ఆలోచించుకోవాలి. ఈ విధానలోపం ఎవరిది? ఇవాళ ఎవరైతే ఒక్క ఛాన్స్‌ అడుగుతున్నరో.. వాళ్లకు 10, 12 ఛాన్స్‌లు ఇచ్చిండ్రు.. వాళ్లేం చేయలేదు. తొమ్మిదిన్నర సంవత్సరాల కింద తెలంగాణ పరిస్థితి ఏంది? ఏవిధంగా ఉండే? ఎక్కడ చూసిన భయమయ్యే పరిస్థితి.. వలసలు, కరువు, సాగునీరు లేదు.. మంచినీళ్లు లేవు.. కరెంటు లేదు.. ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉంటదో తెలియదు.. 

Read more RELATED
Recommended to you

Latest news