కేసీఆర్ సంపద పెంచాలంటున్నారు. సంపదను పెంచలేదు.. అవినీతిని పెంచారు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ పాలసీని పెంచారు. బెస్ట్ చీటింగ్ పాలసీని అమలు చేస్తున్నారు. అనేక విషయాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ఇవాళ కొత్త హమీలను ఇస్తున్నారు. ఇప్పుడే గవర్నమెంట్ వచ్చినట్ట.. 5 సంవత్సరాల తరువాత ఏం చేయబోతున్నాడో హామీలు ఇస్తున్నారు.
సంజీవని కోసం ఆంజనేయుడు ఎలా ఎత్తాడో.. కేసీఆర్ ఆంజనేయుడు అనుకుంటున్నాడు. కేసీఆర్ సకల ద్రోహీ. తెలంగాణ ప్రజల చెవుల్లో గులాబీ పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు విద్య ఏమైంది ఒక్కసారి చెబుతారో.. 2014, 2018, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏయే హామీలు ఇచ్చారో చెబుతారా కేసీఆర్ అని ప్రశ్నించారు. ఒకసారి మీ మొఖం అద్దం ముందు పెట్టుకోండి. నాలుగు సూపర్ స్పెషాలిటీ అన్నాడు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని.. ఈ హామీలు అన్ని ఏమైంది అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.