యుద్ధం ముగించేందుకు హమాస్ డీల్.. ఇజ్రాయెల్ ఒప్పుకునేనా?

-

ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గాజాపై ఇంకా ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకురావాలనే యోచనలో హమాస్ ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కాల్పుల విరమణకు సంబంధించి హమాస్ ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్‌ అల్ హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందు సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్‌తో సంధికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

ఈ డీల్కు ఇజ్రాయెల్ ఒప్పుకుంటే ఆయుధాలు వీడతామని చెప్పారు. ఆ తర్వాత గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో చేరాలనుకుంటున్నట్టు ఓ వార్తాసంస్థతో తెలిపారు. హమాస్‌ను నిర్మూలించడంలో ఇజ్రాయెల్ విజయం సాధించలేదని, ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే దెబ్బతీయగలిగిందని పేర్కొన్నారు. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నారు. అయితే ఖలీల్‌ అల్ -హయ్యా డిమాండ్లను ఇజ్రాయెల్ పరిశీలించే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. అక్టోబర్ 7 నాటి దాడుల తర్వాత హమాస్‌ను నాశనం చేస్తామని ఆ దేశం ప్రతిజ్ఞ చేసింది. అంతేగాక పాలస్తీనా దేశం ఏర్పాటుకు కూడా ఏ మాత్రం సుముఖంగా లేదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news