లోక్సభ ఎన్నికలు ముమ్మాటికీ మా పాలనపై రిఫరెండమే : సీఎం రేవంత్

-

కాంగ్రెస్ పాలనపై నమ్మకంతో చెబుతున్నానని.. లోక్సభ ఎన్నికల్లో కచ్చితంగా 14 సీట్లు గెలుస్తాం అని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో అసలైన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యేనని తెలిపారు. కేసీఆర్‌కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని.. మాటిచ్చాం.. తప్పిక చేసి చూపిస్తామని పునరుధ్గాటించారు. రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో రైతులకు వచ్చే ఆగస్టు నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అందుకు తమ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కల్పిస్తామని తెలిపారు. కచ్చితంగా వంద రోజుల తమ పాలనను రిఫరెండంగా భావించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. 14 ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాతీర్పు ఎలా ఉన్నా గౌరవించాల్సిందేనన్న రేవంత్.. గత నాలుగు నెలల్లో మేం అందించిన పాలనలో అద్భుతాలు చేయకపోయినా.. తప్పులు మాత్రం చేయలేదని తాము బలంగా నమ్ముతున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news