నిరుద్యోగులు ముదురు బెండ కాయలు అంటూ సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. నిన్న నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.. దాని వల్ల కోచింగ్ సెంటర్లు కోట్లు సంపాదిస్తాయని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. అయితే.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ పై నిరుద్యోగులకు సపోర్ట్ గా నిలిచిన వారు మండిపడుతున్నారు.
ముఖ్యమంత్రికి ఏమైనా సోయి ఉన్నదా.. నిరుద్యోగులను పట్టుకొను వంకాయ.. బెండకాయ అంటున్నాడని ఫైర్ అయ్యారు పృథ్వీరాజ్. అవ్వి అసలు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా.. రోడ్డు సైడ్ రోమియోలో, స్ట్రీట్ ఫైటర్స్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నవ్… కాంగ్రెస్ పార్టీ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తీసుకువచ్చారు.. వాళ్లు కూర్చున్న చెట్టును వాళ్ళే నరుక్కుంటున్నారని ఆగ్రహించారు పృథ్వీరాజ్.
కాంగ్రెస్ నాయకులకు సోయి ఉందోలేదో తెలుస్తలేదు.. వాళ్లే కధ చెప్పింది గ్రూప్ 2,3 పోస్టులు పెచ్చుతామని, 1:100 కి పెంచుతామని చెప్పింది కూడా వాళ్లే కధ.. వీళ్లు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు అంతే కధ అన్నారు. పరీక్షలు ఒకదానికి ఒకటి సమయంలేదు కాబట్టి పోస్ట్ పోన్ చేయమని అడిగారు.. సీఎం రేవంత్ రెడ్డి చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక టీమ్ తో కూర్చొని మాట్లాడి కన్విన్స్ చేయకుండా.. రెచ్చగొట్టే లాగా మాట్లాడుతూన్నాడని నిప్పులు చెరిగారు.
https://x.com/TeluguScribe/status/1812341212495671676