గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనపైన స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్కు చెందిన ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు తెలంగాణ యువతను కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు.. అరచేతిలో వైకుంఠం చూపించారని ఆగ్రహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీరి మోసపూరిత మాటలు నమ్మిన నిరుద్యోగుల వలన ఆ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు లభించాయని తెలిపారు.
కానీ.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏడు నెలలైనా ఇప్పటిదాకా ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భర్తీ చేస్తామని చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలేదని నిప్పులు చెరిగారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.