తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. సీఎం అసెంబ్లీలో ఒకలా.. బహిరంగ సభల్లో మరోలా వ్యవహరిస్తున్నారు. మిగులు బడ్జెట్ ఉందని అసెంబ్లీలో చెబుతున్నారు. వరంగల్ సభలో.. రవీంద్రభారతిలో ఇలా చాలా సందర్భాల్లో ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని.. గత ప్రభుత్వం అప్పులు చేయడం వల్లనే దారుణ పరిస్తితి ఏర్పడిందని తెలిపారు.

పరిపాలన అంటే పంచ్ డైలాగ్ లు కాదన్నారు. లగచర్లలో 9నెలలు రైతులు ధర్నా చేస్తే పట్టించుకోలేదన్నారు. సీఎం కు ప్రస్టేషన్ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ప్రతిసారి రుణమాఫీ అంటారు. రాష్ట్రంలో పూర్తిగా కనీసం ఏ ఒక్క గ్రామంలోనైనా రుణమాఫీ చేశారా..? అని ప్రశ్నించారు. సిరిసిల్ల, కొండారెడ్డి పల్లి గ్రామంలో పూర్తిగా రుణమాఫీ చేసినట్టయితే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు లేదంటున్నారు. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎందుకు రద్దు చేశారు అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉప్పు-నిప్పులా ఉంటాయి. కానీ తమిళనాడులో మా సీఎం గారు చెప్పిన విధానాన్ని సమర్థించినట్టు గుర్తు చేశారు కేటీఆర్.