ఫార్మాసిటీ పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి : కేటీఆర్

-

ఫార్మాసిటీ పై ప్రభుత్వం ఓ క్లారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడారు. ఫార్మాసిటీ నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కేవలం 13 కంపెనీలు కాదు.. వందలాది కంపెనీలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఫార్మాసిటీని అడ్డుకోవడం లేదు. ఫార్మాసిటీనీ రద్దు చేస్తామని గతంలో మీరే చెప్పారు. 

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు. హైడ్రా అని పెట్టారు. పేదలవి కూలగొడుతున్నారు. పెద్దలవి కూల్చడం లేదు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రశ్నించారు. పరిశ్రమలు వెనక్కి వెళ్లి పోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడైనా 100 శాతం రుణమాఫీ జరిగిందా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం సబబేనా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మైనర్ పిల్లలను కూడా బూతులు తిట్టారు. వారికి పిల్లలు, ఫ్యామిలీ ఉంటుంది.. కానీ మాకు ఫ్యామిలీ, పిల్లలు ఉండరా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news