కేసీఆర్ దిగిపోయే నాటికి రూ.8.19 లక్షల కోట్ల అప్పు : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ దిగిపోయే నాటికి అన్ని అప్పులు కలిపితే రూ.8.19 లక్షల కోట్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. తాము 15 నెలల్లో రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేశామని.. ఇందులో రూ.1.53 లక్షల కోట్లు పాత అప్పులకే చెల్లించామని స్పష్టం చేశారు. కూలిపోయిన కాళేశ్వరానికి కూడా రూ.5వేల కోట్లకు పైగా చెల్లించామన్నారు. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు.

తమ ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉండేవారని పేర్కొన్నారు. ప్రతీకార రాజకీయాలు తనకు రావని.. నేను చేసుంటే ఇప్పటికే కొందరూ జైలులో ఉండేవారని వ్యాఖ్యానించారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే.. రూ.500 జరిమానా విధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రోన్ ఎగురవేశారని ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారని గుర్తు చేశారు. జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని.. తన బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్ పై వచ్చి వెళ్లానని ఎమోషనల్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news