పంట నష్టం పై ఫోటో ప్రదర్శన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో  రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో సూర్యపేట జిల్లాలో జరిగినటువంటి పంట, ఆస్తి నష్టం గురించి వివరాలను తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. అలాగే పంట నష్టం పైన ఫోటో ప్రదర్శన చేసాడు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని వెల్లడించారు.

తెలంగాణలో దాదాపు రూ.5వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేయాలని.. రాజకీయాలకు ఇది సమయం కాదని చెప్పారు. సూర్యపేట జిల్లాలో దాదాపు 30 సెంటిమీటర్ల భారీ వర్షం పడిందని తెలిపారు. అధికారులు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారని.. పంట, ఆస్తి నష్టం పై అధికారులు నివేదిక అందించారని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. 

 

Read more RELATED
Recommended to you

Latest news