వరద సహాయ చర్యలపై విభాగాల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు మంత్రి నారా లోకేష్. అలాగే అధికారులకు అప్పగించిన బాధ్యతను ఏ మేరకు పూర్తి చేశారన్న విషయమై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు లోకేష్. వరద బాధితులకోసం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 81 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసారు. విజయవాడ నగరంలో నీటమునిగిన రవినగర్, వాంబేకాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో ఎంఐ-17 హెలీకాప్టర్ ద్వారా 3వేల కిలోలు, ఎఎల్-హెచ్ ద్వారా 2వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు పంపిస్తున్నారు.
ఇక వివిధ ప్రాంతాలనుంచి ఆహారాన్ని రప్పించి బాధితులకు చేరవేసే బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి జి.వీరపాండ్యన్ కు అప్పగించాడు లోకేష్. పొరుగు జిల్లాలైన బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలను పంపించాలని టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. వరదముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా మెడికల్ టీమ్ లు ఏర్పాటుచేయాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబుకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.