నయీం ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి : వి.హనుమంతరావు

-

40 కి పైగా హత్యలు, బెదిరింపులు కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకుని.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన నయీం గురించి తెలిసిందే. గతంలో కోట రూపాయల భూములు కాజేశాడు. చివరకు పేదల భూములు కూడా లాక్కున్న కరుడుగట్టిన నేరస్థుడు. అయితే నయీం ఎన్ కౌంటర్ అయ్యాక ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ఏమాయ్యాయని తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వి. హన్మంతరావు ప్రశ్నించారు.

తాజాగా వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నయీం లాక్కున్న పేదల భూములు ఏమయ్యాయి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం ఎలా సీరియస్ గా విచారిస్తుందో.. నయీం ఆస్తులు, డబ్బుల విషయంలో కూడా అలాగే విచారణ చేపట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సారించాలి. దీన్ని సీరియస్ గా తీసుకుని విచారణ జరిపినట్లెతే.. అక్రమంగా పేదల దగ్గర లాక్కున్న భూములన్ని వారివి వారికి ఇవ్వొచ్చు’. అని వి. హన్మంతరావు చెప్పుకొచ్చారు

Read more RELATED
Recommended to you

Latest news