వైరా వేదికగా ఏర్పాటు చేసిన చేసిన భారీ భహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి BRS పై విరుచుక పడ్డారు. ప్రజలు అండగా నిలబడతే BRS నీ బద్దలు కొడతాం అని తెలిపారు. అలాగే తెలంగాణలో BJPకి 8 సీట్లు ఇస్తే తెలంగాణకు ఏం ఇవ్వలేదు అని అన్నారు. అలాగే హరీష్ రావు కు భట్టి విసిరినా సవాల్ తో నేను ఏకీభవిస్తున్నాను.. చర్చలకు బావ బావమరిది లు ఎవ్వరూ వస్తారో రండి.. చీము నెత్తురు వుంటే చర్చకు రండి అని సవాల్ చేసారు.
ఒడ్డుm పొడువు వున్నదని ప్రజలను మభ్య పెట్టకండి. హరీష్ రావ్ సిద్దిపేట లో రాజీనామా చెయ్.. మళ్ళీ అక్కడ ఎలా గెలుస్తావో చూస్తాను అని అన్నారు. KCR ఫాం హౌస్ లో నుంచి రావడం లేదు… బయటకు వస్తే అబద్దాల చెబుతున్నారు. నాగుపాము కు పాలు పొయకండి. ఎవ్వరూ ఏమీ చెప్పిన నమ్మకండి… యువకులకు నేను ఉద్యోగాలు ఇస్తాను. మాన దెబ్బకు ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ గుండెలు అదరాలి అని రేవంత్ రెడ్డి అన్నారు.