వ్యవసాయ రంగంపై ఇవాళ సీఎం రేవంత్ కీలక మీటింగ్..రుణమాఫీ చేస్తారా ?

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సచివాలయంలో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు వ్యవసాయ రంగంపై సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి తుమ్మలతో కలిసి ఈ సమీక్ష సమావేశం జరగనుంది.

CM Revanth’s key meeting on agriculture sector today

అలాగే ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ అధికారులందరూ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రెండు లక్షల రుణమాఫీపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రంగా ఒత్తిడి ఉంది. దీంతో ఆ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news