ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయ మిత్రులను కించపరిచేలా సీఎం మాట్లాడారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమ్మేళనం లో సీఎం రేవంత్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయ మిత్రులను కించపరిచేలా మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళితే అక్కడ వారిని మునగ చెట్టు ఎక్కిస్తారు ?
నేను ప్రభుత్వ,ప్రైవేటు టీచర్ల ను వేరు గా చూడటం లేదు. 2009 ఆగస్టు లో విద్యా హక్కు చట్టం వచ్చింది. రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ప్రాధమిక హక్కుగా మారింది. రాష్ట్రంలో మొత్తం 40 వేల 941 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు 30 307 ఉన్నాయి,ప్రైవేట్ పాఠశాలల సంఖ్య లెక్కల విషయం లో కొంత వ్యత్యాసం ఉంది. మొత్తం 50 లక్షలు మంది విద్యార్థులు ఉంటే అందులో ప్రైవేటు లోనే 51 శాతం ఉన్నారు. వెనకబడిన ప్రాంతాల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలలను రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఈ పోటీ ప్రపంచంలో అవునన్నా కాదన్నా చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా తన మనవలు, మనవరాళ్లను ప్రైవేటు స్కూల్ కే పంపే పరిస్థితి ఉంటుంది. ప్రైవేటు స్కూళ్ల లో పదో తరగతి ఫెయిల్ అయిన వారు ఉపాద్యాయులుగా ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు ..అది ఎవరి తప్పు ? విద్యా హక్కు చట్టం కింద శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉండాలి ..చాలా స్కూళ్లల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయుల పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు.