బుల్డోజర్ల పై సీఎం సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లపై బుల్డోజర్లపై ఎవరు అడ్డు వస్తారో రండి.. రంగా బిల్లాలు.. అడ్డుగా పడుకోండి. మహేశ్ గౌడ్ తొక్కిస్తాడు.. మా అన్న పీసీసీ గా బీజీగా ఉంటే.. మా హన్మంత్ అన్నను బుల్డొజర్ ని ఎక్కిస్తా.. తొక్కిస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పలువురు సీఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును బెదిరిస్తూ.. హింసను ప్రేరేపిస్తూ భయాందోళనకు గురిచేసే విధంగా సీఎం రేేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చట్టా రిత్యా సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news