ప్రశ్నాపత్రాలు లీకేజీ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో పోటీ పరీక్షల నిర్వహణను పూర్తిగా ఆన్లైన్ లోనే నిర్వహించాలని TSPSC యోచిస్తోంది. అభ్యర్థులు ఎంతమంది ఉన్నా, విడతల వారీగా పరీక్ష నిర్వహించి నార్మలైజేషన్ విధానం అమలు చేసేలా కార్యాచరణ రెడీ చేస్తుంది.
తోలుత వెటర్నరీ అసిస్టెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్, AMVI, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఏఈ, ఏఈఈ పరీక్షలకు, తర్వాత గ్రూప్స్ ఉద్యోగాలకు CBRT విదానాన్ని విస్తరించనుంది. కాగా.. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్-1లో 121 మంది విద్యార్థులకు 100 మార్కులు వచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఆరు రోజుల కస్టడీలో భాగంగా 9 మంది నిందితులను విచారిస్తున్న సిట్.. పలు కీలక ఆధారాలు రాబట్టింది.
టీఎస్పీఎస్సీ నుంచి 20 మంది పరీక్ష రాస్తే అందులో ఇద్దరికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి రమేష్‌కు, మహిళా ఉద్యోగినికి కూడా 100కు పైగా వచ్చినట్లు సిట్ అధికారులు తెలుసుకున్నారు. ఈ ఆధారాలతో కమిషన్‌లోని రమేష్, షమీమ్ లతో పాటు సురేష్ అనే వ్యక్తిని నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని రేపు కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.