పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు… లిస్ట్ లో మీ పేరుని ఉందో లేదో ఇలా చూడండి..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. కేంద్రం రైతుల కోసం కూడా స్కీములని తీసుకు వచ్చింది. రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా చాలా మంది రైతులు ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా పెట్టుబడి సాయం అందిస్తోంది. ప్రతి ఏటా రూ.6 వేలు సాయం మూడు విడతల్లో నాలుగు నెలలకోసారి రూ.2 వేల చొప్పున రైతుల అకౌంట్ లో జమ చేస్తారు.

farmers

ఫిబ్రవరి 26, 2023న రైతుల అకౌంట్ లో 13వ విడత డబ్బులు పడ్డాయి. ఇక 14వ విడత నిధుల ని విడుదల చేయనుంది. పీఎం కిసాన్ 14వ విడత నిధులు త్వరలో విడుదల చేయనుంది కేంద్రం. ఇక పూర్తి వివరాలని చూస్తే.. 14వ విడత ని ఏప్రిల్ చివర్లో కానీ లేదు అంటే మే అర్థభాగంలో కానీ ఇస్తారు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం ఇ-కేవైసీ తప్పనిసరి.

ఈ స్కీము డబ్బులు అందాలంటే తప్పనిసిరగా కేవైసీ చేయించాలి. ఓటీపీ ఆధారిత కేవైసీ అందుబాటులో ఉంది. లేదు అంటే స్థానిక సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లి సైతం బయోమెట్రిక్ ఇ-కేవైసీ చేసుకోవచ్చు. ఇక లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి.

దీని కోసం మొదట మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. ఆ తరవాత మీరు ఫార్మర్స్ కార్నర్‌లో బెనిఫిషియరీ లిస్ట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రాష్ట్ర, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, గ్రామం వివరాలు ఇవ్వాలి. గెట్ రిపోట్ ట్యాబ్‌ మీద క్లిక్ చేయాలి. లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news