Congress chief YS Sharmila took a key decision: కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారానికి రెండు రోజుల పాటు విజయవాడలో ఉండాలని ఆమె యోచిస్తున్నారు. ఇక్కడ ఉంటూ పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నేతలతో చర్చించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు(శుక్రవారం), రేపు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో పార్టీ నేతలతో షర్మిల భేటీ కానున్నారు.
ఇక అటు మొన్న విశాఖలోని డక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెదేపా కార్యకర్తల దాడి ఖండించదగిందని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక, ఎదురు ఈ చర్యలా? మేలుకోకపోతే రేపు ప్రజలు మీకు జవాబు చెప్తారని హెచ్చరించారు. దమ్ముంటే మోడీని నిలదీయండి, అంతే కానీ నిలదీసే గొంతులపై ఉక్కుపాదం మోపద్దు, ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఇటువంటి దాడులను ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందన్నారు వైఎస్ షర్మిల.