కర్ణాటక లో బీఆర్ఎస్ పథకాలు కాంగ్రెస్ కాపీ కొట్టింది : మంత్రి కేటీఆర్

-

కర్ణాటకలో బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ సిరిసిల్లలో పర్యటించారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ బాస్ లు ఢిల్లీలో ఉంటారు, మన బాస్ లు గల్లీ లో ఉంటారు.
జిల్లా పార్టీ కార్యాలయం 13 మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటి ప్రజలది
ఎన్నికలు ఐదేళ్ల కోసం వస్తాయి.

నాయకులతో నే సమస్య. ప్రజలు బాగానే ఉన్నారు. బీఆర్ఎస్  మేనిఫెస్టో  చూసి కాంగ్రెస్, బీజేపీ దుప్పటి కప్పుకొని ఉన్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ పథకాలు బీఆర్ఎస్  వి కాపీ కొట్టారు అని తెలిపారు. కాఫీ కొట్టింది బీజేపీ, కాంగ్రెస్.  నకల్ కొట్టేందుకు ఆకల్ కావాలి. కేసీఆర్ తెలంగాణ ను ప్రేమించినట్లు, అంతకంటే ప్రేమిస్తే ఓట్లు వస్తాయి, కేసీఆర్ ను తిడితే ఓట్లు రావు అన్నారు.

ఖురాన్, భగవద్గీత, బైబిల్ లాగా  బీఆర్ఎస్ మేనిఫెస్టోను చూడాలి. రెండు సార్లు రుణమాఫీ కేసీఆర్ చేశారు, నాకు బాగా నచ్చిన పథకం కేసీఆర్ భీమా, సిలిండర్ ను నరేంద్ర మోడీ నీ తలుచుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ డిపాజిట్ లు గల్లంతు కావాలి, పార్టీ నీ పోల్లు పొల్లు చెయ్యండి. ప్రతి ఊరికి మనం ఎం చేసాము అని లిస్ట్ చూపించండి, అప్పుడు ఓటు అడగండి. ఓటర్ ను అడిగి, ఒప్పించి, మెప్పించి ఓట్లు అడగాలి. కరీంనగర్ భీముడు కమలాకర్ అయన కి మనం చెప్పేది ఎంది, ఆయన గెలుస్తాడు. 45 రోజులు మా కోసం పని చేయండి, ఐదేళ్లు మేము మీకోసం చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news