మా సీఎం రేవంత్ ని… చీప్ మినిస్టర్ అంటున్నావు. కేటీఆర్ మాటలు చీప్ లిక్కర్ తాగిన వాడి మాటల లెక్క ఉన్నాయి అని కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి అన్నారు. కల్లు తాగిన కోతిలెక్క దుంకులాడుతున్నాడు కేటీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో క్రైమ్ లీడర్స్.. లూజ్ లీడర్స్ కి కరక్ట్ మొగుడు రేవంత్ రెడ్డే. తల్లి గుండెల్లో ఉండాలి.. అందుకే తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ లోపల పెడతున్నం మేము అని తెలిపారు.
అయినా మీకు అధికారం రావడం అనేది కల. మేము సోనియా గాంధీ..రాహూల్ గాంధీల కు నీతి కలిగిన గులాములం. మీ లెక్క కన్నింగ్ కాదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇంటికి మీ కుటుంబం అంతా వెళ్లి ఆమె కాళ్ళ మీద పడ్డప్పుడు ఏమైంది అని పేర్కొన్నారు. అలాగే ఐటీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ నే అని గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియోలు ప్రదర్శించారు జగ్గారెడ్డి.