ఇచ్చిన మాట ప్రకారం.. తమ ప్రభుత్వం రూ.2లక్షల లోపు రుణమాఫీ చేసిందని.. హరీశ్ రావు నువ్వు రాజీనామా చేయి.. రాజీనామా చేస్తే.. మైనంపల్లి పోటీ చేస్తాడు. సిద్దిపేట ఉపఎన్నికలో హరీశ్ రావు గెలిస్తే.. నేను ఎన్నికల్లో పోటీ చేయనని మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో మైనంపల్లి అన్న ఉండాలి. లేదా హరీశ్ రావు అన్న ఉండాలి. ఇద్దరింట్లో ఎవ్వరో ఒక్కరే ఉండాలని పేర్కొన్నారు మైనంపల్లి. హరీశ్ రావుకు మైనంపల్లి హనుమంతరావు ఉప ఎన్నికల సవాల్ విసిరారు.
మరోవైపు మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీనీ విడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో హరీశ్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో హరీశ్ ను ఓడించడమే తన లక్ష్యమని అప్పట్లో సవాల్ చేశారు. అప్పటి నుంచి మైనంపల్లి వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. మెదక్ లో మైనంపల్లి హన్మంత్ రావు కుమారుడు విజయం సాధించిన విషయం తెలిసిందే.