అక్బరుద్దీన్ ఓవైసీ తో కాంగ్రెస్ నేతల భేటీ

అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థున్ ఓవైసీ తో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గంటపాటు అబరుద్దీన్ తో కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం పార్టీ కూడా సెక్యులర్ అంటుందని.. కాబట్టి మేము మాట్లాడామని అన్నారు. ఎంఐఎం తో మాట్లాడితే తప్ప? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.

అక్బరుద్దీన్, తాను పాత మిత్రులమని చెప్పారు. కాంగ్రెస్, ఎమ్ఐఎం రెండు సెక్యులర్ భావాలు ఉన్న పార్టీలేనని అన్నారు. తమ ఇద్దరి మధ్య రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, గాంధీ కుటుంబం గురించి చర్చ జరిగిందని తెలిపారు. రెండు పార్టీల మధ్య పొత్తు విషయం భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు జగ్గారెడ్డి. ఇక ఇదే విషయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ తో రాజకీయ చర్చలు ఏమీ జరగలేదన్నారు. కేవలం బడ్జెట్ మీదనే చర్చించామని.. అక్బర్ తో భేటీ పెద్ద వార్త ఏమీ కాదన్నారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?