మన దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పండించే పంటలలో ఎక్కువగా వరిని పండిస్తారు.. అయితే అన్ని ప్రాంతాల్లో అగ్గి తెలుగు ఎక్కువగా బాదిస్తుంది.పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు వైరక్యులేరియా గ్రిజీయా అనే శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది.. తెగులు లక్షణాలు వివిధ దశల్లో కనిపిస్తుంటాయి. నారుమడిలో మరియు నాటిన వరిపైరు తొలిదశలో ఆకులపైన నూలుకండె ఆకారంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అనుకూల వాతావరణ పరిస్థితులలో ఇవి పెద్దవై మచ్చల చివర్లు మొనదేలి ఉంటాయి. ఈ మచ్చల అంచులు ముదురు గోధుమ రంగు లేదా నలువు రంగులో వుండి మచ్చల మధ్య భాగం బూడిద లేదా తెలుపు రంగులో ఉంటాయి..
వాతావరణ పరిస్థితుల కారణంగా అవి పెద్ద పై ఆకు అంత వ్యాపించి ఆకు పూర్తిగా ఎండి పోతుంది..పిలక దశలో అకులపైన ఉన్న మచ్చలు క్రమేపి మొక్కల కణుపులకు సోకడం వల్ల ఆ భాగం ముదురు గోధుమ రంగు లేదా నల్లగా మారి చివరకు కణువులు కుళ్ళిపోతాయి.ఈనిక దశలో మెడపైన నల్లని మచ్చలు ఏర్పడి కంకులలోని పోషకాలు అందకపోవడం వలన మెడలు విరిగి వ్రేలాడతాయి. గింజలు తాలుగా మారతాయి.. అలాంటి దశలో ఉన్న గింజలను ఆడించిన అది పిండి అవుతుంది.. లేదా నూక అవుతుంది..
అగ్గి తెగులు నివారణ చర్యలు..
నత్రజని అధిక మోతాదులో వాడటం, రాత్రి ఉష్ణోగ్రతలు 20 సెల్సియస్ కన్న తగ్గినపుడు, వగటి. ఉష్ణోగలు 5-10 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు, గాలిలో చేమ. 90 శాతం కన్నా ఎక్కువ, జల్లులు మరియు మబ్బుతో కూడిన వాతావరణం, వారం రోజుల పాటు మంచుకురవడం, పొలంలో మరియు పొలంగట్లపైన గడ్డిజాతి కలువు మొక్కలు ఉండటం అగ్గితెగులు వ్యాప్తి చెందటానికి సహాయ పడతాయి..
ఈ తెగులు తరచూ ఆశించే ప్రాంతాలలో తెగులు తట్టుకునే రకాల సాగు, విత్తనశుద్ధి తప్పనిసరిగా చేనుకోవాలి. పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే టైసెక్షజోల్ 0.6 గ్రా. లేదా ఐసోఫ్రోథయోలేన్ 1.5 మి.లీ లేదా కాసుగామైసిన్ 25 మి.లీటరు నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి. వాతావరణ పరిస్థితులను బట్టి 10-15 రోజుల మధ్యలో పిచికారి చెయ్యాలి.. ఇలా చెయ్యడం వల్ల అగ్గి తెగులు మాయం అవుతుంది.. పూర్తి సమాచారం కోసం వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..