నేడు ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన!

-

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇంతవరకు 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశాలున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు నేడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు రానున్నారు.

ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానం సూచనలతో ఆయన వస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఖమ్మం టికెట్‌ను భట్టి సతీమణి నందిని కూడా ఆశిస్తున్నారు. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డితో పాటు రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు తదితరులు కూడా ఈ టికెట్‌ను ఆశిస్తుండటంతో వీరిలో ఎవరికి కేటాయిస్తారనేదాన్ని బట్టి కరీంనగర్‌ టికెట్‌ను కూడా నిర్ణయిస్తారని సమాచారం.

కేసీ వేణుగోపాల్‌ ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో సమావేశమవుతారు. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థుల ఖరారుతో పాటు అనేక అంశాలపై సమావేశంలో చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news