బ్రేకింగ్: తెలంగాణా అసెంబ్లీలో భారీగా కరోనా కేసులు

తెలంగాణా అసెంబ్లీలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి అసెంబ్లీలో విధుల్లో ఉన్న వారికి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి తెలంగాణా అసెంబ్లిలో కరోనా కలకలం రేగింది. తాజాగా నిర్వహించిన పరీక్షలో అసెంబ్లి డ్యూటీలో ఉన్న 13 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక మజ్లీస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

coronavirus
coronavirus

ఆయన గత వారం మొత్తం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సిబ్బందికి కరోనా రావడంతో ఇప్పుడు అధికారులు అప్రమత్తం అయ్యారు. సిఎం కేసీఆర్ కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలకు కరోనా సోకినా సంగతి తెలిసిందే. కొంత మంది మంత్రులు కూడా కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు.