ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. ప్రసవం కోసం వచ్చిన మహిళా మృతి

-

వైద్యుల నిర్లక్ష్యాన్ని ఓ బాలింత మృతి చెందింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన మేడమోని కల్పన  సుఖ ప్రసవం కోసం అచ్చంపేట వంద పడకల ఆసుపత్రికి భర్త ఆంజనేయులు తీసుకెళ్లాడు. అక్కడ ప్రసవం చేసేందుకు సిబ్బంది గర్భిణీ స్త్రీని సిద్దం చేశారు. అయితే విధుల్లో ఉన్న డాక్టర్ తన వద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకోలేదని అక్కస్సుతోనే ప్రసవం చేయకుండా నిరాకరించిందని భర్త ఆంజనేయులు ఆరోపించాడు.

భార్య ఆవేదన చూసిన ఆంజనేయులు అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడి వైద్యులను సంప్రదించగా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే రూ. 35 వేలు అవుతుందని చెప్పడంతో.. సరేనని భర్త చెల్లించేందుకు అంగీకరించాడు. ప్రైవేటు ఆసుపత్రిలో ఆ గర్భిణీకి సర్జరీ వైద్యులు సర్జరీ చేశారన్నారు. సర్జరీ చేసిన అనంతరం మగ బిడ్డకు మహిళ జన్మనిచ్చింది. పసిబిడ్డ క్షేమంగానే ఉన్నా… బాలింతకు రక్తస్రావం ఎంతకు ఆగక పోవడంతో ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు పేషెంట్ పరిస్థితి విషమంగా మారిందని వెంటనే జిల్లా ప్రభుత్వ కేంద్రానికి తీసుకెళ్లామని సూచించడంతో తీసుకెళ్లినట్టు తెలిపారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భసంచిని తొలగిస్తే.. రక్తం ఆగిపోతుందని వైద్యులు సూచించడంతో భర్త అందుకు ఒప్పుకున్నాడు. గర్భసంచి తొలగించినప్పటికీ రక్తస్రావం జరుగుతూనే ఉంది. బలవంతంగా భర్త ఆంజనేయులుతో సంతకాలు చేయించుకొని కొన్ని పరీక్షలు బయట చేయించుకోవాలని చెప్పారు. అంబులెన్సులోకి పెషెంట్ ని ఎక్కించారు. అప్పటికే కల్పన మరణించింది. తన భార్య మరణించడానికి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే కారణం అని వాపోయాడు భర్త ఆంజనేయులు.

Read more RELATED
Recommended to you

Latest news