అక్క అనుమానస్పద మృతి.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పారిపోయిన చెల్లెలు

-

అక్క అనుమానస్పద మృతి.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చెల్లెలు పారిపోయిన సంఘటన కోరుట్ల – భీమునిదుబ్బలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, కోరుట్ల – భీమునిదుబ్బలో నివాసం ఉండే బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు సంతానం కాగా పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తూ వర్క్ ఫ్రం హోం చేస్తుంది.

చిన్న కూతురు చందన బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. ఓ ఫంక్షన్ నిమిత్తం తల్లితండ్రులు సోమవారం హైదరాబాద్ వెళ్లగా మంగళవారం ఉదయం దీప్తి సోఫాలో శవమై కనిపించింది. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో చిన్న కూతురు చందన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిపోయినట్లు బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజిలో నమోదైంది. ఇంట్లో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు ఉండగా మద్యం సేవించిన అనంతరం దీప్తిని చంపారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news