కవిత బెయిల్ పిటిషన్లపై నేడు దిల్లీ హైకోర్టులో విచారణ

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇవాళ కివత బెయిల్ పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ట్రయల్ కోర్టు ఇప్పటికే కవిత బెయిల్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును కవిత దిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. మే 6న రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్ర ఉందని బెయిల్‌ తిరస్కరించింది. దిల్లీ మద్యం విధానం ఈడీ కేసులో మార్చి 16వ తేదీన కవిత అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్టు కాగా.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో కవిత తిహాడ్‌ జైలులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news